సంతనూతలపాడు: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు నూతలపాడు అంబేద్కర్ నగర్ కు చెందిన క్రాంతి కుమార్ గా గుర్తించిన పోలీసులు
సంతనూతలపాడు లోని పెద్ద గచ్చుల బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం బైక్ పై చీమకుర్తి వైపు నుండి వస్తున్న యువకుడు ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఏర్పాటు చేసిన కర్రలను ఢీకొని మృతి చెందిన విషయం తెలిసిందే .అయితే ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు నూతలపాడు అంబేద్కర్ నగర్ కు చెందిన క్రాంతి కుమార్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు