కనిగిరి: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో టిడిపి మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధ
కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు ఏర్పాట్లను టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ మంగళవారం పరిశీలించారు. నియోజకవర్గంలోని కనిగిరి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు మండలాల్లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ పర్యటించి మహానాడు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. టిడిపి నాయకులు చేసిన ఏర్పాట్ల పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. టిడిపి వర్చువల్ గా ఈ నెల 27 28 తేదీల్లో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి తరలివచ్చే టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు సుధ సూచించారు.