గిద్దలూరు: గిద్దలూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతల నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ కాశీగా పేరుబడిన శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానానికి తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కలు చెల్లించారు. దోష నివారణకు పలువురు ప్రముఖులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.