కనిగిరి: పట్టణంలో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లికి పొంగళ్ళ కార్యక్రమం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కనిగిరి పట్టణంలోని గార్లపేట రహదారిలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం పోలేరమ్మ తల్లికి పొంగళ్ల కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. కనిగిరి పట్టణము నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళలు పొంగళ్ళు పెట్టి, అమ్మవారికి మహా నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.