సంతనూతలపాడు: చీమకుర్తి మెప్మా కార్యాలయ CO అవినీతికి పాల్పడుతూ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు: మెప్మా RP ధనలక్ష్మి ఆరోపణ
చీమకుర్తి: తమను చీమకుర్తి మెప్మా కార్యాలయ సీ ఓ అంజినాదేవి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, మెప్మా RP ధనలక్ష్మి ఆరోపించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ... మహిళల పొదుపు గ్రూపులో కొత్త సభ్యులను చేర్చుకోవాలంటే సీవోకు లంచం ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఆ మహిళా అధికారి చేస్తున్న అవినీతిని వ్యతిరేకించిన వారిని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.