సంతనూతలపాడు: చీమకుర్తిలో 23వ మైన్స్ సేఫ్టీ వీక్ ను ప్రారంభించిన మైనింగ్ శాఖ అధికారులు, గెలాక్సీ గ్రానైట్ లో అధికారుల తనిఖీలు
చీమకుర్తి పట్టణంలో 23వ మైన్స్ సేఫ్టీ వీక్ ను సోమవారం మైనింగ్ శాఖ అధికారులు ప్రారంభించారు. డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ సేఫ్టీ TR కన్నన్, మైనింగ్ శాఖ అధికారులు వేణుగోపాల స్వామి, శివశంకర్ ఆధ్వర్యంలో చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ క్వారీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్మికుల కోసం తీసుకుంటున్న భద్రతా ప్రమాణాలు, రక్షణ, పరికరాల వినియోగంపై ఈ తనిఖీలు కొనసాగాయి. గనుల్లో ప్రమాదాల నివారణ ,కార్మికుల భద్రత కోసం తీసుకోవలసిన జాగ్రత్తలపై మైనింగ్ యజమానులకు కార్మికులకు అధికారులు అవగాహన కల్పించారు.