ఉరవకొండ: జీడిపల్లిగ్రామంలో గొర్రె పిల్లల మందపై కుక్కలు దాడి చేయడంతో 52 గొర్రెల మృతి మరో అయిదు గొర్రెలను తీవ్రంగా గాయపరిచిన వైనం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం జీడిపల్లి గ్రామంలో గొర్రెల కాపరి ఎర్రిస్వామికి చెందిన గొర్రె పిల్లల మందపై కుక్కలు దాడి చేయడంతో 52 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తన జీవనోపాధిగా ఉన్న గొర్రెల పెంపకం లో 52 గొర్రెల మృతితో సుమారు రూ.2.5 లక్షల వరకు నష్టం చేకూరిందని బాధితులు వాపోయాడు. చెట్టు నీడన గొర్రె పిల్లల మందను ఉంచి పెద్ద గొర్రెల మేపుకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చే లోపు ఘటన చోటు చేసుకుందని తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.