మనుబోలు జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థినులు అండర్ 14 విభాగంలో కబడ్డీలో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని సోమవారం హెచ్ఎం అమూల్య కుమారి తెలిపారు. నెల్లూరు డివిజన్ స్థాయిలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆదివారం జరిగిన పోటీలలో కబడ్డీలో మిధున శ్రీ, శ్రీ కావ్య మంచి ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ఆమె తెలిపారు. ఎంపికైన విద్యార్థినులను హెచ్ఎం, మంజువాణి ఉపాధ్యాయులు అభినందించారు.