సంతనూతలపాడు: చీమకుర్తి మండలం చంద్రపాలెం లో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
చీమకుర్తి మండలంలోని చంద్రపాలెం గ్రామంలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా , వాటిని సత్వరం పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అధికారులు పాల్గొన్నారు.