కనిగిరి: మున్సిపాలిటీలో అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ఎటువంటి అనుమతులు లేకుండా వేసిన వెంచర్ల లోని ప్లాట్లను ప్రజలు కొని మోసపోవద్దని కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ సూచించారు. అనుమతులు లేకుండా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో వేసిన వెంచర్ల లోని ప్లాట్ల హద్దురాలను మున్సిపల్ కమిషనర్ జెసిబి యంత్రాలతో శుక్రవారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి క్లారిటీగా చేసి విక్రయాలు కొనసాగించాలంటే తప్పనిసరిగా అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతనే ప్లాట్లు విక్రయించాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.