కనిగిరి: పట్టణంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం (SIR) పై టిడిపి శ్రేణులకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం పై కనిగిరిలో బూత్ లెవెల్ ఏజెంట్లు, టిడిపి క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిలకు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఎన్నికల సంఘం ఈనెల 15 నుండి జూలై 15 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓ లతో సమన్వయం చేసుకొని , ఓటర్ల మార్కులు, చేర్పులపై పత్రాలు సమర్పించి రసీదులు పొందాలన్నారు. పార్టీకి సంబంధించిన ప్రతి ఓటు జాబితాలో గల్లంత కాకుండా చూసుకోవాలన్నారు.