కనిగిరి: జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పై చర్యలు తీసుకోవాలి: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అసభ్య,అవమానకర మరియు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ రూరల్ జనసేన శాసనసభ్యులు పంతం నానాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. పంతం నానాజీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కనిగిరి పోలీస్ స్టేషన్లో నారాయణ యాదవ్ శనివారం ఫిర్యాదు చేశారు. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కూటమి నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నారాయణ యాదవ్ ఆరోపించారు.