కనిగిరి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనిగిరి మండల సిపిఐ కార్యదర్శి రామారావుకు అంతిమ వీడ్కోలు, వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు
కనిగిరి మండల సిపిఐ కార్యదర్శి జిపి రామారావు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. జిపి రామారావు అంత్యక్రియలను కనిగిరి మండలం ఏరువారి పల్లి గ్రామంలో గురువారం నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం లోని 6 మండలాల నుండి సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు రామారావు అంతిమయాత్రకు వందలాదిగా తరలివచ్చి అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. రామారావు సిపిఐ పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని అంతిమయాత్రకు హాజరైన పార్టీ నాయకులు అన్నారు.