రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో డివిస్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ నియమకాలను చేపట్టారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు డివిస్ లేబరేటరీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ నియమకాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో దివిస్ లేబరేటరీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాంగణ నియమకాలను చేపట్టడం జరిగిందని ఇందులో కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇద్దరు మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థినీలు ముగ్గురు పరీక్షలు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని వీరికి మూడు లక్షల రూపాయలు వార్షిక వేతనం అందిస్తారని జేఎన్టీయూ ఉపకులపతి హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.