రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం నాలుగు గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం లోని 6 మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశం నిర్వహించి జరగబోయే ఎన్నికల్లో బూతు ఏజెంట్లు నియామకం గ్రామస్థాయి లెవెల్ ఏజెంట్లు నియామకం గురించి చర్చించడం జరిగిందని అదేవిధంగా సర్ పైన అవగాహన కల్పించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.