కనిగిరి: పట్టణంలో అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తులతో వైద్యులు, సిబ్బంది ప్రదర్శన
కనిగిరి: అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కనిగిరి ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కవ్వొత్తులతో ప్రదర్శన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ... ప్రతి ఏటా మే నెల మూడవ ఆదివారం హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మృతులకు నివాళులు అర్పిస్తూ, హెచ్ఐవి తో జీవిస్తూ ఆత్మ న్యూనతా బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.