రాప్తాడు: మనీలా లో బిఎస్ సిపిఎల్ కంకర క్రషింగ్ మిషన్ పై చర్యలు తీసుకోవాలని అనంతపురం గ్రీవెన్స్ సెల్ లో ఫిర్యాదు చేసిన సిపిఎం నేతలు
అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గ్రీవెన్స్ కార్యక్రమం లో రాప్తాడు సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో మనీలా సిపిఎల్ కంకర క్రషింగ్ మిషన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ కుఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ మనీలా గ్రామంలో సర్వేనెంబర్ 26లో 4 ఎకరాల ప్రభుత్వ భూములు ఎలాంటి విచారణ లేకుండా ఎమ్మార్వో మోహన్ కుమార్ ఆర్ ఐ ప్రదీప్ ఎన్ఓసీ ఇవ్వడం జరిగిందని ఇలాంటి వాటిపై ఇప్పటికైనా విచారణ చేసి క్రషింగ్ మిషన్ వెంటనే మూసివేయాలని సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు.