ఉరవకొండ: చిన్న ముస్టూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కరపత్రాల పంపిణీ
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని చిన్న ముస్టూరు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమ కరపత్రాలను ఉరవకొండ డివిజన్ మలేరియాసబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య బృందం శనివారం ఉదయం నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు సీజనల్ వ్యాధుల పైన అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, ఇళ్ల వద్ద మురుగునీరు లేకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.