కనిగిరి: చంద్రశేఖరపురంలో రెవిన్యూ సమస్యలపై ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
చంద్రశేఖరపురంలో ఒక నెల, ఒక నియోజకవర్గం, 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. భూ రికార్డుల సవరణలు, జీరో ఖాతాలు, సర్వే సంబంధిత సమస్యలు, హద్దు వివాదాలు , ఇతర రెవిన్యూ సమస్యలపై ప్రజలు కలెక్టర్కు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.