సంతనూతలపాడు: మద్దిపాడు మండలం గుండ్లపల్లి సెంటర్ లో రోడ్డు ప్రమాదం, రెండు లారీలు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలు
మద్దిపాడు మండలం గుండ్లపల్లి సెంటర్ అంజలిగ్రానైట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై మామిడికాయలు లోడుతో ఒంగోలు నుంచి గుంటూరు వెళుతున్న లారీని ఇదే మార్గంలో వెనుక వైపు బంతిపూల లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టింది. బంతిపూల లారీ డ్రైవర్కు గాయాలు కాగా 108లో ఒంగోలు రిమ్స్క తరలించారు.