కొండపి: టంగుటూరు మండల కేంద్రంలోని బస్టాండ్ బొమ్మల సెంటర్లో మహాత్మా జ్యోతిభా ఫూలే జయంతి కార్యక్రమం నిర్వహణ
టంగుటూరు మండల కేంద్రంలోని బస్టాండ్ బొమ్మల సెంటర్లో మహాత్మా జ్యోతిభా ఫూలే జయంతి కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. టీడీపీ నాయకులు నాగ శ్రీను ఆధ్వర్యంలో బీసీ నాయకులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణకు, వారి విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ఫూలే అని అన్నారు.