కొండపి: పొన్నలూరు ఓ మోస్తరు వర్షం.. ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతన్నలు
పొన్నలూరు మండలంలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారింది.. ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తోంది. ఇటీవల కాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదై, ఎండ వేడిమికి అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడి వర్షం కురుస్తుండడంతో కొంతమేరకు ఉపశమనం పొందారు. అయితే ఈ అకాల వర్షాలతో తమకు పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.