రాప్తాడు: అనంతపురంలో ఆరు మండలాలకు సంబంధించిన టిడిపి నేతలతో సమావేశం నిర్వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మూడున్నర నుంచి ఐదున్నర గంటలకు ఆరు మండలాలకు సంబంధించిన టిడిపి నేతలతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మరియు పార్లమెంట్ పరిధిలో టిడిపి గ్రామ కమిటీలు అన్నిటిని వెంటనే కార్యకర్తలను ఎంపిక చేయాలని పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని అందువల్ల గ్రామ కమిటీలు అన్నిటిని పూర్తి చేయాలని టిడిపి నేతలను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు.