రాప్తాడు: అనంతపురం జిల్లా కేంద్రంలో 52 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 54 మందికి 52 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాల కాలంలో 11 కోట్ల 50 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఈరోజు కూడా 54 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్నామని భవిష్యత్తులో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.