ఉరవకొండ: బెళుగుప్పలో పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం నందు వెలుగుప్ప మండల తాసిల్దార్ అనిల్ కుమార్ అధ్యక్షతన శనివారం పౌర హక్కుల పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ చట్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, అపరిచితుల ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చేయడం నేరమని బాల్య వివాహాల నివారణ పై కాలనీ వాసులతో కలిసి అధికారులు ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నాగమణి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, హెడ్ కానిస్టేబుల్ వన్నూర్ స్వామి పాల్గొన్నారు.