రాప్తాడు: ఎస్ కే యూనివర్సిటీలోనూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో యోగా డే సందర్భంగా విద్యార్థినిలు ఉద్యోగులు యోగాసనాలు సాధన చేశారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఎస్కే యూనివర్సిటీలోనూ జేఎన్టీయూవిశ్వవిద్యాలయంలో ఉదయం 6:30 నుంచి 9:30 గంటల వరకు అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జెఎన్టియు ఉపకళపతి సుదర్శన్ రావు , ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ తదితరులు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు అధ్యాపకులు విద్యార్థినిలతో కలిసి యోగాన్ని సాధన చేయడం జరిగిందని గతంలో యోగా అంటే ఎవరికీ తెలిసేది కాదని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవతోనే యోగా గురించి ఇంత ప్రచారం రావడం జరిగిందని యోగ ప్రతి ఒక్కరు సాధన చేయాలని ఉపకులపతి జ్యోతి కుమార్, సుదర్శన్ రావు తెలిపారు.