రాయదుర్గం: మాదవి ట్రావెల్ బస్సును అడ్డుకున్న ఎంఆర్పిఎస్ నాయకులు, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో మాదవి ట్రావెల్స్ బస్సును ఎంఆర్పీఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు ముందు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు బైఠాయించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఈనెల ఒకటో తేదీన మారెంపల్లి వద్ద మాదవి ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ముదిగల్లుకు చెందిన రామన్న మృతి చెందారని, ఇప్పటి వరకు మృతుడి కుటుంబానికి న్యాయం చేయలేదని ఆందోళనకారులు ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.