సంతనూతలపాడు: యోగాంధ్ర 2026 పై చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కల్పించిన మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య
చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం యోగాంధ్ర 2026 కార్యక్రమం పై చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చీమకుర్తి మున్సిపాలిటీ వ్యాప్తంగా ఈనెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తున్నమన్నారు. పట్టణంలోని ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని కమిషనర్ పిలుపునిచ్చారు. యోగ వల్ల కలిగే ఉపయోగాలను స్థానికులకు కమిషనర్ వివరించారు.