సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం 2026 పై అవగాహన ర్యాలీ కార్యక్రమం
నాగులప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కిషోరీ వికాసం 2026 పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 నుండి 18 సంవత్సరాల లోపు బాల బాలికలు చెడు వ్యసనాలు, టీవీలు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్లు సూచించారు. కౌమార దశలోని బాలికలు రక్తహీనత బారిన పడకుండా ఉండేందుకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, గ్రామస్తులు పాల్గొన్నారు.