రాప్తాడు: మారూరు గ్రామంలో స్వచ్ఛ పథకంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేయించిన జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల సమయంలో జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగరాజు నాయుడు రాప్తాడు డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు స్వచ్ పథకంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగరాజు నాయుడు మాట్లాడుతూ మారూరు గ్రామంలో ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని జిల్లా పంచాయతీరాజ్ అధికారి నాగరాజు నాయుడు పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో అశోక్ బాబు పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.