కనిగిరి: మార్కాపురం, ప్రకాశం జిల్లాకు సీఎం చంద్రబాబు కరువును తట్టుకునే పంటల రూపకల్పన చేశారు: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి: వెనుకబడిన మార్కాపురం, ప్రకాశం జిల్లాలకు సీఎం చంద్రబాబు కరువును తట్టుకునే పంటల రూపకల్పన చేశారని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. మంగళగిరిలో గురువారం నిర్వహించిన మహానాడులో అన్నదాతకు అండగా అనే తీర్మానాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి బలపరుస్తూ ప్రసంగించారు. కరువు పీడిత ప్రాంతమైన కనిగిరిలో రైతులకు మేలు చేసే విధంగా మంత్రి నారా లోకేష్ రిలయన్స్ బయో గ్యాస్ ఇండస్ట్రీకి రూపకల్పన చేశారన్నారు. రైతులకు లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నారని, రైతులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.