ఉరవకొండ: శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో మాస శివరాత్రి పూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో మాసశివరాత్రి సందర్భంగా శనివారం సాయంత్రం 8 గంటలకు మాస శివరాత్రి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేక పూజా కార్యక్రమాల్లో మహిళలు సామూహికంగా పాల్గొని మాస శివరాత్రి వ్రత పూజలను నిర్వహించారు. పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వ్రత పూజల్లో భాగంగా తీర్థ ప్రసాద అన్నదాన కార్యక్రమాలను దాతలతో కలిసి ఆలయ సేవ కమిటీ సభ్యులు నిర్వహించారు.