రాప్తాడు: బీసీలకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అనంతపురం బీసీ గళం సమావేశంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం 12:30 గంటల సమయంలో వైయస్సార్ పార్టీ బీసీ సెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గళం సమావేశంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించలేదని కేవలం ఎమ్మెల్యే అనుచరులకు టిడిపి నేతలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందాయే కానీ అర్హత ఉన్నవారికి సామాన్య ప్రజలకు ఎక్కడ సంక్షేమ పథకాలు గాని బీసీ లోన్లు కానీ ఇవ్వలేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బీసీ గళం సమావేశంలో విమర్శించారు.