రామచంద్రాపురం: తెల్లాపూర్ విద్యుత్‌నగర్ రైల్వే అండర్ బ్రిడ్జికి రూ.21 కోట్లు మంజూరు
తెల్లాపూర్ విద్యుత్‌నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి విస్తరణకు రూ.21 కోట్లు మంజూరయ్యాయి. ఎంపీ రఘునందన్ రావు చొరవతో ఈ నిధులు విడుదలయ్యాయి. గత 25 ఏళ్లుగా ఉన్న అండర్‌పాస్ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.