పటాన్చెరు: రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో ఘనంగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రక్త వర్ణ అలంకరణలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, హోమాలతో ఆలయం సందడిగా మారింది.