ఉరవకొండ: పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో హనుమంతరాయ వాహనంపై విహరించిన స్వామి వారు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారు హనుమంతరాయ వాహనంపై ఆలయం మాడవీధుల్లో విహరించారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలను ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు బ్రహ్మోత్సవాల్లో పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.