కనిగిరి: కృష్ణం పల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
హనుమంతునిపాడు మండలం కృష్ణంపల్లిలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల నగదును పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల నగదును సీఎం చంద్రబాబు భారీగా పెంచి లబ్ధిదారులకు అందజేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ సీఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.