సంతనూతలపాడు: నాగులుప్పలపాడు లో వాహనాలకు అదనంగా ఉండే ఎల్ఈడి లైట్లు తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఎస్సై మహేంద్ర నాయక్
నాగులుప్పలపాడు లో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు వాహనాలకు అదనంగా అమర్చి ఎల్ఈడి లైట్ల తొలగింపు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎస్సై మహేంద్రా నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలు, కార్లు, ఇతర వాహనాలను ఎస్ఐ మహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాలకు అదనంగా అమర్చిన ఎల్ఇడి లైట్లను తొలగించారు. కంపెనీ వారు ఇచ్చిన లైట్లు కాకుండా అదనంగా ఎల్ఈడీ లైట్లు అమర్చడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటి నివారణ కోసం ఎల్ఈడీ లైట్లు తొలగిస్తున్నామని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఈడి లైట్లు ఆమరిస్తే చర్యలు తప్పవన్నారు