సంతనూతలపాడు: నాగులుప్పలపాడులో పోషణ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా గర్భవతులు, బాలింతలకు అవగాహన కార్యక్రమం
నాగులుప్పలపాడు లో పోషణ పక్కోడ పక్షోత్సవాల్లో భాగంగా గర్భవతులు, బాలింతలకు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రు పాలు స్థాపించడం ద్వారా బిడ్డల గణనీయమైన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉషారాణి సూచించారు. అదేవిధంగా రక్తహీనతతో బాధపడేవారు తప్పనిసరిగా ఐరన్ సప్లిమెంట్ ఆహారంతో పాటు ఐరన్ టాబ్లెట్లను వినియోగించాలన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని, తక్కువ ధరలు ఉండే ఆకుకూరలు, కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నారు.