కనిగిరి: పరిసరాలు పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలి: కనిగిరి ఎస్సై సందీప్
కనిగిరి: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని కనిగిరి ఎస్సై సందీప్ సూచించారు. కనిగిరిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఎస్సై సందీప్ పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలను, చెత్తను తొలగించి శుభ్రం చేయించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే వ్యాధులు దరిచేరమన్నారు. కనిగిరి పోలీస్ స్టేషన్ లో పచ్చదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.