ఉరవకొండ: బెలుగుప్ప, ఉరవకొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో లోతట్టు రహదారి ప్రాంతాలు జలమయం
అనంతపురం జిల్లా బెలుగుప్ప, ఉరవకొండ మండల కేంద్రాల్లో సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షపాతం 33.6 మిల్లీమీటర్లు, 38.2 మిల్లీమీటర్ల చెప్పున నమోదు కావడం జరిగిందని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఉన్నపలంగా ఈదురు గాలులతో కూడి కురిసిన భారీ వర్షానికి బెలుగుప్ప మండల కేంద్రంలోని లోతట్టు రహదారి ప్రాంతాలు జలమయంగా మారాయి. బెలుగుప్ప తగ్గు పర్తి, బెలుగుప్ప హనకన హాల్ గ్రామాల మధ్య పెద్ద వంక ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎండ వేడిమి నుండి కొంత ఉపశమనం లభిస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు.