రాప్తాడు: పుల్లలరేవులో ఒక కోటి 30 లక్షల రూపాయలతో బీటీ రోడ్డును ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పుల్లలరేవు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల సమయంలో సిసి రోడ్డును బీటీ రోడ్డును ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ పుల్లలరేవు గ్రామంలో 50 లక్షల రూపాయలతో సిసి రోడ్డును పుల్లలరేవు నుంచి గొందిరెడ్డిపల్లికి ఒక కోటి 30 లక్షల రూపాయలతో బీటీ రోడ్డును నిర్మాణం చేపట్టి ఈరోజు ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గం లో అవసరమైన ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.