కొండపి: వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు CM చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు: మంత్రి స్వామి
వెనుకబడిన పశ్చిమ ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పెద చెర్లోపల్లి మండలంలోని దివాకరపల్లిలో ఏప్రిల్ 2న మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి శుక్రవారం పరిశీలించారు. గిద్దలూరు, మార్కాపురంలో కూడా ఈ ప్లాంట్లు ఏర్పాటు అవుతాయన్నారు.