కొండపి: కొండేపి నియోజకవర్గంలో పారిశుధ్య కార్యక్రమాలకు 18 ట్రాక్టర్లు మంజూరు : మంత్రి స్వామి
స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కొండపి నియోజకవర్గంలోని 6 మండలాలలోని 18 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను మంజూరు చేసింది.ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వీటిని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పంచాయతీలకు చెందాల్సిన నిధులను దుర్వినియోగం చేసిందని ఆయన తెలిపారు అదేవిధంగా పంచాయతీల అభివృద్ధికి, చెత్త సేకరణకు ట్రాక్టర్లను వినియోగించి పారిశుధ్యం ను క్రమబద్ధీకరించాలని తెలిపారు.