కొండపి: కొండపి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లుకి రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎంపీడీవో రామాంజనేయులు
కొండపి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లుకి ప్రతి బుధవారం నిర్వహించే సాధారణ రివ్యూ మీటింగ్ లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ తో సమీక్ష సమావేశాన్ని ఎంపీడీవో రామాంజనేయులు నిర్వహించారు. వర్క్ కు సంబంధించిన ఐడీలు, మస్టర్లు కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ తో ముఖాముఖి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ఆదేశించారు