రాప్తాడు: వడ్డుపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వడ్డుపల్లి గ్రామంలో సోమవారం 12:10 గంటల సమయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ వడ్డుపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో భాగంగా రైతు పోతన్న ఐదు ఎకరాల పొలంలో కంది విత్తనాలను సాగు చేయడం జరిగిందని నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తున్నామని రైతులు మంచి పంటలు పండించి అభివృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు.