బీర్పూర్: జగిత్యాల ఆసుపత్రిలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన చెట్ల రాజన్న ప్రమాదవశాత్తు గాయపడి జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.