సంతనూతలపాడు: సినీ రంగానికి దివంగత సినీ నటుడు కమలాకర్ రెడ్డి చేసిన సేవలు చిరుస్మరణీయం: ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మ
చీమకుర్తి: సినీ రంగానికి దివంగత సినీనటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దివంగత సినీ నటుడు కమలాకర్ రెడ్డి జయంతి సందర్భంగా దర్శిలో ఆయన సమాధి వద్ద బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ వెంకాయమ్మ, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్న వయసులోనే శని రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కమలాకర్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం తీరని ఆవేదనను మిగిల్చిందని వారు అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.