సంతనూతలపాడు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చీమకుర్తిలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా
చీమకుర్తి పట్టణంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. ఆంజనేయులు మాట్లాడుతూ... మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు.