ఉరవకొండ: విడపనకల్లులో మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ కార్యక్రమాలు
గ్రామాల్లో మలేరియా నుంచి రక్షణ కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని అనంతపురం జిల్లావిడపనకల్లు ఎంపీడీఓ చల్ల రాధాకృష్ణ తెలియజేశారు. బుధవారం మండల కేంద్రంలో మలేరియా వ్యతిరేక మాస ఉత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మంత్రి పయ్యావుల కేశవ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన గ్రామాలలో గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు ముందస్తుగా మందును పిచికారి చేస్తున్నామన్నారు దోమలు కుట్టకుండా ప్రభుత్వ హాస్టలందు ACM 5`/.WP మందును పిచికారి చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.